* పోచమ్మ తల్లి దీవెనలతో సుఖ సంతోషాలతో ప్రజలు చల్లగా ఉండాలి *సర్పంచ్ బొల్లం. భాగ్యలక్ష్మి
శాలివాహన,మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆషాడ బోనాలు.... హిందుస్థాన్ మీడియా న్యూస్, ప్రతినిధి ,చిన్నకోడూర్, సిద్దిపేట జిల్లా,ఆగస్టు 8: రామునిపట్ల గ్రామంలోశాలివాహన,మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు నిర్వహించారు. ఆషాడ మాసం పురస్కరించుకొని గ్రామంలోని పోచమ్మ దేవతకు శివసత్తుల, బైండ్ల, పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిదాలు ,కోలాటాలతో ఊరేగింపుగా పోచమ్మ బోనాలు నిర్వహించారు.మేకపోడేన్లను కోడి పిల్లలను గ్రామదేవతకు సమర్పించారు. గ్రామంలో పాడి పంటలు, పశు సంపదలు చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లం.భాగ్యలక్ష్మి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘాల అధ్యక్షులు గోవిందారం .తిరుపతి, బొల్లం వెంకట్రాజ్యం,ఉపాధ్యక్షులు ఆకుల. శివకుమార్, భూపతి, గౌరవాధ్యక్షులు బండారి. రాజయ్య, వర్కోలు....