చేర్యాల మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్దయ్య కన్నుమూత
1978లో చేర్యాల శాసనసభ్యుడిగా ప్రజాసేవ అందించిన గొర్రె సిద్దయ్య స్వగ్రామం బైరాన్‌పల్లి, చేర్యాల ప్రాంతంలో అలుముకున్న తీవ్ర విషాదఛాయలు సిద్దయ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చేర్యాల (హిందుస్థాన్ మీడియా): చేర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు గొర్రె సిద్దయ్య (95) అనారోగ్యంతో ఆదివారం (ఆగస్టు 09) హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలియగానే స్వగ్రామమైన బైరాన్‌పల్లితో పాటు చేర్యాల, మద్దూరు పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. 1978లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సుదీర్ఘ సేవలు ఉమ్మడి సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం చారిత్రక గ్రామం బైరాన్‌పల్లికి చెందిన గొర్రె సిద్దయ్య, 1978లో అప్పటి చేర్యాల నియోజకవర్గం...