కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం

ఆగస్టు 10 జైల్‌భరోను జయప్రదం చేయాలి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రైతులు, కార్మికులు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలి: బానోతు సంతోష్ నాయక్ హిందుస్థాన్ మీడియా: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్‌భరో కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ అనుబంధ ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బానోతు సంతోష్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తుండటంతో దేశంలో...