అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు కాంగ్రెస్ నేతల పరామర్శ

అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మామిండ్ల కనకరాజు, అలాగే కాంగ్రెస్ యువ నాయకుడు ఎండ్ర చందన్ కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు వారిని పరామర్శించారు.ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి బాధిత కుటుంబాలను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన సహాయం అందించేందుకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవీన్‌రెడ్డి,...