చేర్యాల మాజీ జడ్పీటీసీ సుంకరి సరిత కన్నుమూత

కన్నీటి వీడ్కోలు.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ సుంకరి సరిత (44) క్యాన్సర్‌తో పోరాడుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. ఆమె మృతితో ఆకునూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం సుంకరి సరిత పార్థివదేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలకు హాజరై కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 2014 నుంచి 2019 వరకు జడ్పీటీసీగా పనిచేసిన సుంకరి సరిత, తన పదవీకాలంలో మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని నాయకులు గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు...