*​ప్రతి పాఠశాలలో ఫీజుల బోర్డు,స్టాఫ్ అర్హతల వివరాలు ప్రజలకు కనిపించాలి!

*​విద్య వ్యాపారంగా మారకూడదంటే బడుల్లో పారదర్శకత అత్యవసరం *​తగిన అర్హతలు లేని ఉపాధ్యాయుల నియామకాలు, విచ్చలవిడి ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట పడాలి ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​అక్షరాస్యతను పెంపొందించాల్సిన విద్యను సేవగా కాకుండా లాభాపేక్ష కలిగిన వ్యాపారంగా మార్చుతున్న కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల తీరుపై పారదర్శకత తీసుకురావాలంటే విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద తరగతుల వారీ ఫీజుల వివరాల బోర్డుతో పాటు బోధిస్తున్న ఉపాధ్యాయుల విద్యార్హతలు, అనుభవం మరియు నియామక వివరాలు ప్రదర్శించే ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడాన్ని విద్యాశాఖ తప్పనిసరి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు గట్టిగా కోరుతున్నాయి. *​ఒకే...