ఆగస్ట్ 10న జరిగే జైల్ భరో ను విజయవంతం చేయాలి

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న ఉద్యమానికి ప్రజలు తరలిరావాలి: ప్రజాసంఘాల నేతలు హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కొమురవెల్లి, అయినాపూర్ గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరి రవీందర్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుద్ధిపడిగె కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళలు, పేదల ప్రయోజనాలకు విరుద్ధమైన విధానాలను అమలు చేస్తోందని...