తవ్వారు.. వదిలేశారు..!మూడేళ్లుగా మధ్యలోనే ఆగిన పనులు!

​నరకయాతన అనుభవిస్తున్న చేర్యాల భవన యజమానులు, వ్యాపారులు ​దారి లేక ఖాళీగా ఉంటున్న భవనాలు.. మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం ​పన్నుల వసూళ్లలో ఉన్న శ్రద్ధ.. కనీస సౌకర్యాల కల్పనలో ఏదీ? ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​మూడేళ్లుగా మధ్యలోనే ఆగిన కాలువ పనులు ​చేర్యాల పట్టణ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల పేరుతో గుంతలు తవ్వి, ఆపై పనులను ఏళ్ల తరబడి అరకొరగా వదిలేయడంతో స్థానిక భవన యజమానులు, వ్యాపారులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా డ్రైనేజీ సైడ్ కాలువ నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టి మూడేళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడం మున్సిపల్ అధికారుల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారింది....