ఈ దారి... నరకదారి..!.. అయ్యా..కాంట్రాక్టర్.. ఈ 2 కిలోమీటర్లు NH-365బి కాదా..??
కొడవటూరు కమాన్ నుంచి బచ్చన్నపేట వరకు గుంతల మయమైన జాతీయ రహదారి కోట్ల రూపాయల కాంట్రాక్ట్.. ప్రయాణికులకు మాత్రం తప్పని నిత్య నరకయాతన తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్ బచ్చన్నపేట (హిందుస్థాన్ మీడియా): జనగామ – బచ్చన్నపేట మీదుగా సాగుతున్న జాతీయ రహదారి (ఎన్‌హెచ్-365బీ) నిర్మాణ పనుల్లో తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం బహిర్గతమవుతోంది. జనగామ నుంచి దుద్దెడ క్రాస్ రోడ్డు వరకు రహదారి పనులు పూర్తిస్థాయిలో పూర్తయినప్పటికీ (అక్కడక్కడ మినహా ), కొడవటూరు కమాన్ నుంచి బచ్చన్నపేట వరకు ఉన్న సుమారు రెండు కిలోమీటర్ల మేర రహదారిని మాత్రం కాంట్రాక్టర్ పూర్తిగా వదిలేశారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు నిత్యం నరకయాతన...