ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళి

గ్రంథాలయంలో మొక్కలు నాటి అంజలి ఘటించిన నాయకులు ​గ్రంథాలయ విద్యుత్ కనెక్షన్‌కు సహకరించిన ఏఈ వెంకన్న గౌడ్‌కు శాలువాతో ఘన సన్మానం ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని చేర్యాల పట్టణంలోని స్థానిక శాఖా గ్రంథాలయంలో గురువారం (ఆగస్టు 06) ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కౌన్సిలర్ పోతుగంటి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన స్మారకార్థం గ్రంథాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ​తెలంగాణ సాధనలో జయశంకర్ సేవలు చిరస్మరణీయం ​ఈ సందర్భంగా పలువురు...