సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి : చేర్యాల సీఐ రమేష్ నాయక్
చేర్యాల (హిందూస్థాన్ మీడియా): *అపరిచితులకు ఓటీపీలు చెప్పొద్దు* సైబర్ నేరాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే మోసాల నుంచి పూర్తి రక్షణ పొందవచ్చని చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్ స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన 'సురక్షా తిరంగా సైబర్' కార్యక్రమంలో భాగంగా బుధవారం (ఆగస్టు 05) చేర్యాల పట్టణ ప్రధాన రహదారిపై కళాశాలల విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. *వాసవి గార్డెన్స్‌లో సైబర్ అవగాహన సభ* ర్యాలీ అనంతరం పట్టణంలోని వాసవి గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సైబర్ నేరాలు జరుగుతున్న తీరుపై విద్యార్థులకు, స్థానికులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ బానోతు రమేష్...