మహిళా అధికారిని వేధింపులకు గురిచేసిన జర్నలిస్ట్ అరెస్ట్, రిమాండ్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు: హుస్నాబాద్ ఏసీపీ సదానందం హిందుస్థాన్ మీడియా, మద్దూరు: సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్టీ మహిళా అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో భైరాన్‌పల్లి గ్రామానికి చెందిన ఒక ప్రముఖ దినపత్రిక విలేకరి జెగ్గం అనిల్ కుమార్అ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, బాధిత మహిళా అధికారి ఇచ్చిన ఫిర్యాదులో, జెగ్గం అనిల్ కుమార్ గత కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మద్దూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో,...