ఊరు మెచ్చిన ఉపాధ్యాయుడు దేవరాజ్
భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న దేవరాజ్ పుస్తక విద్యకే కాదు.. జీవన నైపుణ్యాలకు పెద్దపీట సేంద్రీయ వ్యవసాయం నుంచి సైన్స్ ప్రాజెక్టుల వరకు వినూత్న బోధన.. ప్రభుత్వ బడికి పెరిగిన ఆదరణ హిందుస్థాన్ మీడియా, నారాయణరావుపేట: ఒక మంచి ఉపాధ్యాయుడు తలచుకుంటే ప్రభుత్వ పాఠశాల రూపురేఖలనే మార్చగలడని నిరూపిస్తున్నారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని నాంచారుపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు చేగూరి దేవరాజ్. పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు ఆచరణాత్మక విద్య, జీవిత విలువలు, శాస్త్రీయ దృక్పథం, వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందుతున్నారు. 74 నుంచి 140 మందికి పెరిగిన విద్యార్థుల సంఖ్య 2018లో ఈ పాఠశాలలో విధుల్లో చేరిన దేవరాజ్, గ్రామస్తులు,...