అప్పుల బాధతో రైతు బలవన్మరణం..
చేర్యాల పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య.. కుటుంబంలో విషాదం హిందుస్థాన్ మీడియా, చేర్యాల: సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త దొమ్మాట గ్రామానికి చెందిన శెట్టె రామస్వామి (38) వ్యవసాయం కోసం ఆవుల షెడ్డు నిర్మాణం, బోర్లు వేయడం తదితర అవసరాల నిమిత్తం అప్పులు చేశారు. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురైన రామస్వామి సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో స్వల్ప వాగ్వాదం అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి వెళ్లిపోయారు. తర్వాత చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం....