అక్రమ ఇసుక రవాణా పై మద్దూరు పోలీసుల కొరడా...
రెండు వాహనాలు స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు హిందుస్థాన్ మీడియా, మద్దూరు: సిద్ధిపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం పోలీసులు నిర్వహించిన పెట్రోలింగ్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మద్దూరు ఎస్‌ఐ ఎం.డి. ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు గాగిళ్లపూర్–లింగాపూర్ గ్రామాల మధ్య ప్రవహించే మోహితుమ్మెద వాగు నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గాగిళ్లపూర్ గ్రామానికి చెందిన నారపల్లి రాజు, బోయిని సిద్ధులు ప్రభుత్వ అనుమతులు లేకుండా అశోక్...