సూక్ష్మ కళా రూపాలతో ఆకట్టుకున్న జక్కనపల్లి రాము
కేజీబీవీ లో ప్రత్యేక కళా ప్రదర్శన హిందుస్థాన్ మీడియా, చిన్నకోడూరు: సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)**లో నిర్వహించిన కళా ప్రదర్శన కార్యక్రమంలో చేర్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు జక్కనపల్లి రాము తన వినూత్న కళాఖండాలతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. శారద ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ ప్రదర్శనలో సుద్ద ముక్కలతో రూపొందించిన సూక్ష్మ కళారూపాలను జక్కనపల్లి రాము ప్రదర్శించారు. ఈ అరుదైన కళాఖండాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఎం. శారద మాట్లాడుతూ, ఇలాంటి కళా ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఏకాగ్రత, క్రమశిక్షణ, సమయపాలన, కళా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతో దోహదపడతాయని...