హలో... మున్సిపల్..నా వైపు ఓ లుక్కేయండి!గాంధీ రహదారి ఏరియా కథనం..

*​"నేను కూడా మీ మున్సిపల్ పరిధిలోని రహదారినే... మరి నా దుస్థితి ఎందుకు కనిపించడం లేదు?"* *​గాంధీ ఏరియా రాకపోకలు నరకప్రాయం... ఉన్న బస్టాప్ ను తీసేసారు..* *​నాసిరకం బ్రిడ్జి డిజైన్ తో ప్రాణ సంకటం.. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నిత్యం భయం భయం!* గాంధీ విగ్రహం తీసేయగానే.. నన్నూ లెక్కలోంచి తీసేసారా..? ​చేర్యాల (హిందూస్థాన్ మీడియా ): *​గాంధీ ఏరియా రహదారి ఆవేదన కథనం* ​"హలో మున్సిపల్... నేను గాంధీ ఏరియా నుంచి కడవేర్గు వైపు వెళ్లే ప్రధాన రహదారిని. మీ చేర్యాల మున్సిపాలిటీ పన్నుల పరిధిలోనే ఉన్నాను. కానీ నా ఈ ఛిద్రమైన దుస్థితి మాత్రం అధికారుల కళ్లకు ఎందుకు...