మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర
భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించిన మహిళలు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు హిందుస్థాన్ మీడియా, సిద్ధిపేట రూరల్: సిద్ధిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారికి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బోనాల జాతరను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో ఇంటింటి నుంచి బోనాలను ఎత్తుకుని డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ కనకదుర్గాదేవి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తూ కుటుంబాల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, గ్రామాభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. బోనాల జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో...