మద్దూర్ మోడల్ స్కూల్ హాస్టల్ లో DEO రమేష్ ఆకస్మిక తనిఖీ
మెనూను తప్పనిసరిగా అమలు చేయాలి అని ఆదేశం హిందుస్థాన్ మీడియా, మద్దూరు: సిద్ధిపేట జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ శుక్రవారం మద్దూరు మోడల్ స్కూల్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న వసతి, ఆహార సౌకర్యాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులతో మాట్లాడిన జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం సకాలంలో అల్పాహారం, గుడ్లు, మాంసాహారం తదితర పౌష్టికాహారం అందుతున్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు....