హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకముందే చేర్యాలను హెచ్చరించిన ప్రమాదం
గుంతల రోడ్డులో ఒరిగిన పెట్రోల్ ట్యాంకర్.. తృటిలో తప్పిన పెను విపత్తు హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల పట్టణంలోని అంగడి బజార్–ఆకునూరు రహదారిపై శుక్రవారం చోటుచేసుకున్న పెట్రోల్ ట్యాంకర్ ఘటన మరోసారి రహదారి దుస్థితిని, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేలా చేసింది. గుంతలతో నిండిన రహదారిలో లోడ్‌తో వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ ఒక్కసారిగా పక్కకు ఒరిగి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఇటీవల జరిగిన చేర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో (జూలై 29) ఇదే రహదారిపై భారీ గుంతలు ఉండటంతో వాహనదారులకు ప్రమాదం జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. అయితే ఆ తీర్మానం అమలుకాకముందే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రత్యక్ష సాక్షుల...