ముందు రోడ్లు బాగు చేయండి.. తర్వాత చలాన్లు వేయండి
*అధికారులను ప్రశ్నిస్తున్న కర్షక్ నగర్, గాంధీ చౌరస్తా వాసులు* హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల మండల పరిధిలోని కర్షకనగర్, విద్యానగర్, ఉట్లపల్లి, గాంధీ చౌరస్తా ప్రాంతాల్లో రహదారులు రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారినా సంబంధిత అధికారులు ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యానగర్ చౌరస్తా వద్ద పోలీసులు తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ చలాన్లు విధిస్తుండడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడం అవసరమేనని అంగీకరిస్తూనే, ముందుగా సురక్షితమైన రహదారులను కల్పించడం కూడా అధికారుల బాధ్యతేనని అభిప్రాయపడుతున్నారు....