లోకక్షేమం.. సకాలంలో వర్షాల కోసం కొమురవెల్లిలో మహా వరుణ యాగం

శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధిలో వేదఘోషల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్ధిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు సోమవారం మహా వరుణ యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని సంకల్పించి ఈ ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరశైవ ఆగమ శాస్త్రోక్త విధానంలో మహాగణపతి పూజ, గౌరీ పూజ, రక్షాబంధనం, స్వస్తి పుణ్యాహవాచనం, నాంది సమారాధన, నవగ్రహ, దిక్పాలక, ఏకాదశ రుద్ర, ఋష్యశృంగ పంచాచార్య కలశ స్థాపన,...