ప్రెసెంటేషన్ హై స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుకలు

నాయకత్వం, సేవాభావంతో ముందుకు సాగాలని అతిథుల పిలుపు హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల పట్టణంలోని ప్రెసెంటేషన్ హై స్కూల్లో విద్యార్థి నాయకుల ఇన్వెస్టిచర్ (Investiture) కార్యక్రమం ఉల్లాసభరితంగా, ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులు బాధ్యతల స్వీకార ప్రమాణం చేసి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రొవిన్షియల్ సిస్టర్ బిజి, ప్రిన్సిపాల్ సిస్టర్ జ్యోతి, మేనేజర్ సిస్టర్ ధన్య జోసెఫ్, మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ, చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్, ఎస్‌ఐ అపూర్వ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, విద్యార్థి నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ క్రమశిక్షణ, సేవాభావం, నిజాయితీ,...