కళ్యాణ కట్టలో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు :వేములవాడ ఈవో
*నాయి బ్రాహ్మణులకు దేవస్థానం ఈవో రమాదేవి హెచ్చరిక* హిందుస్థాన్ మీడియా, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కళ్యాణకట్టల్లో భక్తుల నుంచి నగదు వసూళ్లకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎల్. రమాదేవి తీవ్రంగా స్పందించారు. భక్తుల వద్ద నుంచి నగదు డిమాండ్ చేయడం, వసూలు చేయడం వంటి చర్యలు దేవస్థానం ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత రెండు మూడు రోజులుగా కళ్యాణకట్టల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు నాయి బ్రాహ్మణులు భక్తుల నుంచి నగదు అడుగుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రచారంలోకి రావడంతో దేవస్థానం యంత్రాంగం...