జింబాబ్వేపై భారత్ ఘన విజయం సిరీస్ కైవసం

81, తిలక్ అజేయ 60, వైభవ్ 20 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ హిందుస్థాన్ మీడియా, హరారే: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా మరోసారి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగా, అనంతరం జింబాబ్వేను 129 పరుగులకే ఆలౌట్ చేసి సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. భారత్ బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 81 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. తిలక్ వర్మ కేవలం 29 బంతుల్లో అజేయంగా 60 పరుగులు చేసి...