సిద్దిపేటలో కలకలం.. పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్!
హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట: పోలీసుల అప్రమత్తత లోపమో... లేక ఖైదీ ముందే వేసుకున్న ప్లానో తెలీదు గానీ, సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, వెల్దుర్తి గ్రామానికి చెందిన జొన్నల సాయి కుమార్ అనే ఖైదీని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షలు పూర్తైన అనంతరం ఖైదీలను తిరిగి పోలీసు వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో సాయి కుమార్ పోలీసుల నిఘా నుంచి చాకచక్యంగా తప్పించుకుని పరారయ్యాడు. ఖైదీ పరారైన విషయాన్ని...