చేర్యాల మున్సిపల్ పరిధిలో పందుల పెంపకంపై నిషేధం

*పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలోనే పందుల పెంపకం చేపట్టాలి.. కమిషనర్ నాగేందర్* చేర్యాల (హిందుస్థాన్ మీడియా): చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో పందుల పెంపకాన్ని నిషేధిస్తూ మున్సిపల్ కమిషనర్ నాగేందర్ అధికారిక నోటీసు జారీ చేశారు. పట్టణంలో పందులు స్వేచ్ఛగా సంచరించడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పందుల పెంపకం చేపట్టరాదని, పందుల పెంపకందారులు పట్టణానికి కనీసం 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే పందులను పెంచాలని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం–2019లోని నిబంధనల మేరకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి మున్సిపల్ పరిధిలో...