సిరిసిల్ల పోలీసుల ఉక్కుపాదం....60 బైకులు 3 లీటర్ల మద్యం స్వాధీనం
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం రాజీవ్‌నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.. 60 ద్విచక్ర వాహనాలు, 3 లీటర్ల మద్యం స్వాధీనం సీసీటీవీలు ఏర్పాటు చేసుకోండి.. అనుమానితుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించండి: డీఎస్పీ నాగేంద్రచారి హిందుస్థాన్ మీడియా, రాజన్న సిరిసిల్ల: ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చనే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు శనివారం సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్‌నగర్లో డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత...