జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం
7 వికెట్ల తేడాతో జయభేరి.. వైభవ్ సూర్యవంశీ చారిత్రక అర్ధశతకం.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు తొలి గెలుపు హిందుస్థాన్ మీడియా, హరారే: వరుస టీ20 సిరీస్ పరాజయాల తర్వాత ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. జింబాబ్వేపై అద్భుత విజయంతో కొత్త ఆరంభానికి శ్రీకారం చుట్టింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వేకు భారత బౌలర్లు ఆరంభంలోనే గట్టి షాక్ ఇచ్చారు. మయాంక్ యాదవ్,...