ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు మద్దతుగా చేర్యాల కాంగ్రెస్ నాయకులు

హిందుస్థాన్ మీడియా, న్యూఢిల్లీ/చేర్యాల: నీట్ పరీక్షా పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ, వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా, దౌర్జన్యంగా అదుపులోకి తీసుకోవడాన్ని ఖండిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన దీక్షలో చేర్యాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, అలాంటి నిరసనకు వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి, విద్యార్థులకు...