ఓ వైపు బారికేడ్... మరోవైపు ఫ్లెక్సీ..! భద్రతా ప్రయాణం ఎలా..? చేర్యాలలో అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం

చేర్యాల (హిందుస్థాన్ మీడియా): చేర్యాల పట్టణంలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు అధికారులు కొన్ని ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, అదే ప్రాంతంలో రహదారిపైకి చొచ్చుకొచ్చేలా భారీ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ కారణంగా వాహనదారుల దృష్టి మరలడమే కాకుండా, రోడ్డు విస్తీర్ణం కూడా తగ్గిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బారికేడ్లతో రహదారి కుదించబడితే, మరోవైపు ఫ్లెక్సీలు కూడా రోడ్డు వైపుకు రావడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని రాజకీయ ప్రభావాల కారణంగా 100 అడుగుల వెడల్పు...