విద్యుత్ ఉద్యోగుల ఆర్టిజన్ సమ్మెకు వెళ్తుండగా TVAE జేఏసీ నాయకుల అరెస్టు
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: హైదరాబాద్‌లో నిర్వహించిన విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మె, ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న TVAE JAC యూనియన్ నాయకులను చేర్యాల పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. శాంతియుతంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వెళ్తున్న ఉద్యోగులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఉద్యమాలను అణచివేయకుండా విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని TVAE JAC నాయకులు డిమాండ్ చేశారు. .