శంషాబాద్ లో హృదయ విదారక ఘటన

*రోడ్డుపై పసికందును వదిలేసిన కర్కశులు.. సీసీటీవీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు* హిందుస్థాన్ మీడియా, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్న పేగు బంధాన్నే మరిచిన గుర్తుతెలియని వ్యక్తులు ఓ నవజాత శిశువును రోడ్డుపై అనాథలా వదిలేసి వెళ్లడం కలకలం రేపింది. శంషాబాద్ పరిధిలోని రాళ్లగూడ ఇంద్రనగర్ రాజీవ్ గృహాల సమీపంలో పసికందు ఏడుపు వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకుని చూడగా, రోడ్డుపక్కన శిశువు ఒంటరిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును సురక్షితంగా రక్షించి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పసికందును అక్కడ వదిలేసిన...