రాజేంద్ర నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం
(నేతి పృథ్వి - రిపోర్టర్) ఐదు డివిజన్లకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ హిందుస్థాన్ మీడియా, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లకు కొత్త అధ్యక్షులను నియమించింది. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నియమితులైన డివిజన్ అధ్యక్షులు: నార్సింగి: అశోక్ యాదవ్ నెక్నాంపూర్: జితేందర్ గండిపేట్: నరేందర్ మణికొండ: శ్రీరాములు కోకాపేట్: దుర్గేష్ యాదవ్ నూతనంగా నియమితులైన అధ్యక్షులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సంస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నాయకత్వం సూచించింది.