అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు కాపాడాలి: శ్రేణులకు కొమ్మూరి సూచన
కొమురవెల్లిలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు కాపాడాలి.. కాంగ్రెస్ శ్రేణులకు సూచనలు హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) కార్యక్రమాన్ని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమం నిర్వహణ తీరును పరిశీలించి బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని, అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా...