విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పీడీని, నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి:
హిందుస్థాన్ మీడియా, బెజ్జంకి: బెజ్జంకి మోడల్ స్కూల్‌లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడీపై వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి బొమ్మిడి సాయికృష్ణ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన ఆయన, విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌పైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యాసంస్థలు విద్యార్థులకు భద్రత, క్రమశిక్షణ, విలువలు నేర్పించే కేంద్రాలుగా ఉండాలని, అలాంటి చోటే విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై ప్రభుత్వం ఆదర్శప్రాయమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్...