త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

ఆత్మహత్య కోణంలో దర్యాప్తు అగర్తల, హిందుస్థాన్ మీడియా: త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధంకర్ సోమవారం ఉదయం అగర్తలలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో తన కార్యాలయంలో మృతిచెందిన స్థితిలో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ, మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. అనురాగ్ ధంకర్ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా, 2025లో త్రిపుర డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆకస్మిక మరణం పోలీసు శాఖతో పాటు రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది...