మరి కాసేపట్లో ప్రపంచ ఫుట్ బాల్ సమరం

మెట్‌లైఫ్ స్టేడియంలో టైటిల్ కోసం తలపడనున్న స్పెయిన్ – అర్జెంటీనా హిందుస్థాన్ మీడియా, స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మరికొద్ది గంటల్లో అమెరికాలోని న్యూజెర్సీ మెట్‌లైఫ్ స్టేడియంలో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మరోవైపు యువ ఆటగాళ్లతో దూసుకెళ్తున్న స్పెయిన్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అనుభవం, యువశక్తి మధ్య జరిగే ఈ పోరు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించనుంది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ఇది మరో చారిత్రాత్మక ఫైనల్. వరుసగా మరో ప్రపంచకప్‌ను సొంతం చేసుకునే...