ఎస్‌ఐఆర్‌పై సీరియస్‌గా పనిచేయాలి: కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ హెచ్చరిక

ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు రావొద్దు – క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశం హైదరాబాద్, హిందుస్థాన్ మీడియా: ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇన్‌చార్జ్‌లు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూమ్ సమావేశంలో పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన, ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దని, క్షేత్రస్థాయిలోనే ఉండి ఎన్నికల ప్రచారం తరహాలో పని చేయాలని సూచించారు. బీఎల్‌వోల నివేదికలపై మాత్రమే ఆధారపడకుండా బీఎల్‌ఏల నివేదికలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. పనిచేయని ఇన్‌చార్జ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన, జూలై 30న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనితీరును సమీక్షిస్తామని తెలిపారు. ఇన్‌చార్జ్ మంత్రులు,...