కుంట్లూరులో మల్ రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
పెద్ద అంబర్పేట, అక్టోబర్ 17, హిందుస్థాన్ మీడియా: పెద్ద అంబర్పేట పరిధిలోని కుంట్లూరులో మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో ఆటపాటల మధ్య సందడి చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచిన బతుకమ్మలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. జయప్రకాష్ నగర్ కాలనీ బతుకమ్మ ప్రథమ బహుమతిని గెలుచుకుంది. దీంతో కాలనీ బాధ్యుడు లాల్ మహమ్మద్ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, జీఎస్ సేవా సమితి చైర్మన్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన కుమారుడు అభిషేక్ రెడ్డి కూడా వేడుకలకు హాజరై మహిళలను ఉత్సాహపరిచారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకోవడంతో కుంట్లూరులో పండుగ సందడి నెలకొంది.