🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 18 Oct, 2026 | Page: 1

బియ్య రమేష్ ను పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

మద్దూరు, అక్టోబర్ 18, హిందుస్థాన్ మీడియా: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్‌పూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ యువ నాయకుడు బియ్య రమేష్‌ను జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.
రమేష్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వివరాలతో పాటు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రమేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని, ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఎమ్మెల్యే వెంట సలాక్‌పూర్ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్ కుమార్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్, మందు యాదగిరితో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
🏠 Home