🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 17 Oct, 2026 | Page: 1

నూతనంగా విచ్చేసిన నెక్కొండ ఎస్సైకి సర్పంచుల బృందం సత్కారం!

​ఎస్సై జె. శ్రవణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల ప్రజాప్రతినిధులు
​మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తామని సర్పంచ్‌ల భరోసా
​నెక్కొండ (హిందుస్థాన్ మీడియా):
నెక్కొండ మండలానికి నూతనంగా బదిలీపై విచ్చేసిన ఎస్సై జె. శ్రవణ్ కుమార్‌ను మండల పరిధిలోని సర్పంచ్‌ల బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఎస్సై శ్రవణ్ కుమార్‌కు శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖకు గ్రామ పంచాయతీల తరఫున ఎల్లవేళలా పూర్తి సహకారం అందిస్తామని సర్పంచ్‌లు తెలిపారు.
​ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా రమేష్, నక్కలగుట్ట తండా సర్పంచ్ డాక్టర్ బానోత్ రవీందర్ నాయక్, నెక్కొండ తండా సర్పంచ్ బానోత్ రవికుమార్, పిట్టకాలబోడు సర్పంచ్ సూర్య భాయ్, వెంకటాపురం సర్పంచ్ కవిత-అఖిల్, అలంకానిపేట సర్పంచ్ నిరోషా-శ్రవణ్, మడిపల్లి సర్పంచ్ అనూష-వినోద్, లోక్ నాయక్ సాయిరెడ్డిపల్లి సర్పంచ్ బండారుపల్లి వినయ్ కుమారి-శ్రీనివాస్, చెరువు ముందరి తండా సర్పంచ్ కున్సోత్ మంగమ్మ-శ్రీనివాస్, చిన్న కోర్పుల్ గ్రామ సర్పంచ్ అనిత-భద్రు, తుపనపల్లి సర్పంచ్ మమత-తిరుమల్‌తో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
​– | హిందుస్థాన్ మీడియా |
సామాన్యుడి నేస్తం 📰
🏠 Home