మువ్వన్నెల సొగసుతో మెరిసిన నర్సాయపల్లి బురుజు
త్రివర్ణ పతాకం రంగులతో ప్రత్యేక అలంకరణ
సర్పంచ్ శనిగరం సత్యనారాయణ చొరవ
సిద్దిపేట జిల్లా, మద్దూరు, అక్టోబర్ 15, హిందుస్థాన్ మీడియా: నర్సాయపల్లి గ్రామంలోని బురుజుకు త్రివర్ణ పతాకాన్ని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేయించి గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శనిగరం సత్యనారాయణ.గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో బురుజును మువ్వన్నెల రంగులతో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ అలంకరణతో బురుజు ఆకర్షణీయంగా కనిపిస్తుండగా, గ్రామస్థులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
గ్రామ అభివృద్ధితో పాటు గ్రామానికి ప్రత్యేక శోభ తీసుకొచ్చే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సౌందర్యాన్ని పెంపొందించేలా చేపట్టిన ఈ అలంకరణ నర్సయపల్లి బురుజుకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.