🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 12 Oct, 2026 | Page: 1

జాలపల్లి లబ్ధిదారుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

మాజీ సర్పంచ్‌ చొప్పరి వరలక్ష్మి సాగర్‌, చొప్పరి సాగర్‌ చేతుల మీదుగా పంపిణీ
సిద్దిపేట జిల్లా, దూల్మిట్ట, అక్టోబర్‌ 12, హిందుస్థాన్‌ మీడియా: దూల్మిట్ట మండలం జాలపల్లి గ్రామానికి చెందిన మెతుకు బాల్‌రెడ్డి కుమారుడు మెతుకు నర్సిరెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా మంజూరైన రూ.11,500 చెక్కును మాజీ సర్పంచ్‌ చొప్పరి వరలక్ష్మి సాగర్‌, దూల్మిట్ట మండల బీఆర్‌ఎస్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జి చొప్పరి సాగర్‌ ముదిరాజ్‌ అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అందే ఆర్థిక సహాయం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయ పథకాలు అందడం ద్వారా వైద్య ఖర్చుల భారం కొంతవరకు తగ్గుతుందని తెలిపారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో పాటు వార్డు సభ్యులు నర్మెట కాశి రాములు, గంగుల సత్తయ్య, పోతిరెడ్డి శ్రీను, గొడుగు జంపన్న, తుపాకుల యాదగిరి, తుపాకుల పెద్ది రాజు, చొప్పరి మైసయ్య పాల్గొన్నారు. లబ్ధిదారుడి కుటుంబ సభ్యులు మెతుకు భాస్కర్‌రెడ్డి, మెతుకు మైహిపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
🏠 Home