🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 11 Oct, 2026 | Page: 1

మంజీరా కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన ఆడపడుచులు
పెద్ద అంబర్‌పేట, అక్టోబర్‌ 11, హిందుస్థాన్‌ మీడియా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను పెద్ద అంబర్‌పేటలోని మంజీరా కాలనీలో మహిళలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరిన మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ లయబద్ధంగా ఆడిపాడారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు, సాంస్కృతిక వారసత్వానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. సంప్రదాయాలను కాపాడుతూ మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
🏠 Home