రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు దూల్మిట్ట విద్యార్థినులు
అండర్-13 అంతర్జిల్లా ఛాంపియన్షిప్కు ఆరుగురు ఎంపిక
విద్యార్థినులను అభినందించిన హెచ్ఎం, సర్పంచ్, క్రీడా సంఘం ప్రతినిధులు
ధూళిమిట్ట, అక్టోబర్ 10, హిందుస్థాన్ మీడియా: ధూళిమిట్ట పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించనున్న 11వ అంతర్జిల్లా అండర్-13 సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్లో వారు పాల్గొననున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషకరమని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులు రాణించడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.జిల్లా సాఫ్ట్బాల్ కార్యదర్శి రేణుక మాట్లాడుతూ.. ధూళిమిట్టలో ప్రతిభగల విద్యార్థులు ఉన్నారని, వారికి తగిన వసతులు కల్పించి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తారని అన్నారు.
పోటీలకు ఎంపికైన విద్యార్థినులతో పాటు పాఠశాలలో క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్న వెగ్గలం సతీష్ కుమార్ను ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గునుకుల లీల జగన్మోహన్ రెడ్డి, సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నేతి కైలాసం గుప్త, కార్యదర్శి రేణుక, గ్రామస్తులు, ఉపాధ్యాయ బృందం, సతీష్, శిక్షకుడు నవీన్ అభినందించారు.