🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 09 Oct, 2026 | Page: 1

పెద్ద అంబర్ పేట జెడ్పిహెచ్ఎస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పూల బతుకమ్మలతో విద్యార్థుల సందడి.. ఆటపాటలతో పండుగ కళ
పెద్ద అంబర్‌పేట, అక్టోబర్‌ 9, హిందుస్థాన్‌ మీడియా: పెద్ద అంబర్‌పేటలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయినులు కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి అందంగా అలంకరించి, ఆటపాటలతో సందడి చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కళ్లెపు రాజశేఖర్‌ మాట్లాడుతూ.. దసరా సెలవులకు ముందు చివరి రోజు విద్యార్థులు ఉల్లాసంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home