🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 09 Oct, 2026 | Page: 1

ఆరు నెలలు నిండిన చిన్నారులకు బాలామృతం అందించాలి. సర్పంచ్ సత్యనారాయణ

నర్సాయపల్లిలో ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశం
చిన్నారుల ఎదుగుదలకు పోషకాహారం ఎంతో ముఖ్యం
మద్దూరు, అక్టోబర్‌ 9, హిందుస్థాన్‌ మీడియా: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం ఆరోగ్యలక్ష్మి కమిటీ (ALMS) సభ్యుల సమావేశం నిర్వహించారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, నర్సాయపల్లి సర్పంచ్‌ శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. ఆరు నెలలు నిండిన చిన్నారులకు తల్లిపాలతో పాటు అదనపు పోషకాహారంగా బాలామృతం అందించడం ప్రారంభించాలని తల్లులకు సూచించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు వయసుకు తగిన అనుబంధ ఆహారం అందించడం ఎంతో ముఖ్యమని వివరించారు. పిల్లల పోషణ, ఆరోగ్యంపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అవగాహన కల్పించారు.
🏠 Home