🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 09 Oct, 2026 | Page: 1

వేద పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

రంగురంగుల పూలతో బతుకమ్మలు.. పాటలు, నృత్యాలతో విద్యార్థినుల సందడి
కుకునూరుపల్లి, అక్టోబర్‌ 9, హిందుస్థాన్‌ మీడియా: కుకునూరుపల్లి మండల కేంద్రంలోని వేద ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ పాఠశాల ఆవరణలో సందడి చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ సంతోష్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, మహిళల గౌరవానికి ప్రతీక అని తెలిపారు. గౌరమ్మను పూజిస్తూ కుటుంబాల ఆరోగ్యం, సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థించడం ఈ పండుగ ప్రత్యేకత అని విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ శోభారాణి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home