🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 06 Oct, 2026 | Page: 1

సర్పంచ్ చొరవతో బొబ్బాయిపల్లికి బస్సు సౌకర్యం

వినతికి స్పందించిన ఆర్టీసీ అధికారులు.. గ్రామానికి బస్సు సర్వీసు ప్రారంభం
విద్యార్థులు, ఉద్యోగులు, రైతులకు మెరుగుపడనున్న రవాణా సౌకర్యం
కొండపాక, అక్టోబర్‌ 6, హిందుస్థాన్‌ మీడియా: కుకునూరుపల్లి మండల పరిధిలోని బొబ్బాయిపల్లి గ్రామానికి ఎట్టకేలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గ్రామ ప్రజల రవాణా సమస్యను గుర్తించిన సర్పంచ్‌ కన్నమైన సంపత్‌ యాదవ్‌ కొద్దిరోజుల క్రితం గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసి గ్రామానికి బస్సు సర్వీసు కల్పించాలని వినతిపత్రం అందజేశారు.
సర్పంచ్‌ విజ్ఞప్తికి స్పందించిన ఆర్టీసీ అధికారులు మంగళవారం బొబ్బాయిపల్లికి బస్సు సర్వీసును ప్రారంభించారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వృద్ధులు, ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తగ్గనున్నాయి.ఈ సందర్భంగా సర్పంచ్‌ సంపత్‌ యాదవ్‌, గ్రామస్థులు ఆర్టీసీ డిపో మేనేజర్‌ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల రవాణా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేసిన సర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు.
బొబ్బాయిపల్లి గ్రామానికి ప్రారంభించిన బస్సు సర్వీసును భవిష్యత్తులోనూ నిరంతరాయంగా కొనసాగించాలని గ్రామస్థులు ఆర్టీసీ అధికారులను కోరారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యులు కోల సద్గుణ రవీందర్‌, ఉపసర్పంచ్‌ రాజు యాదవ్‌, మాజీ సర్పంచ్‌ కోల శ్రీనివాస్‌, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home